హెచ్1బి వీసాలతో సహా ఇమ్మిగ్రేషన్ రుసులము భారీగా పెంచుతూ బిడెన్ పరిపాలన యాంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధంచేసింది. యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రతిపాదిత నియమాల ప్రకారం, హెచ్1బి వీసా దరఖాస్తు ఫీజు 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరుగుతుంది. అదేవిధంగా ఎల్-1 వీసా దరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుంచి 1385 డాలర్లకు పెంచింది. ఒ-1 వీసాల దరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుంచి 1055 డాలర్లకు పెంచుతూ ప్రతిపాదనలు చేసింది. హెచ్-2బి పిటిషన్‌ల రుసుము (సీజనల్, వ్యవసాయేతర కార్మికులకు) 460 డాలర్లనుంచి 1080కి పెంచబడింది. హెచ్-1బి అనేది వలసేతర వీసా. ఇది అమెరికా కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నిపుణులు అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. భారత్, చైనా నుంచి ఏటా 10వేల మందిని ఈ ప్రాతిపదికన అమెరికా టెక్ కంపెనీలు నియామకాలు జరుపుతుంటాయి. ఈ వీసా కేటగిరీలపై రుసుము పెంపుదల చట్టబద్దంగా అమెరికాలోకి ప్రవేశించాలని అనుకునే వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)