టాలీవుడ్లో మరో హీరో బ్యాచ్‌లర్ లైఫ్నకు ముగింపు పలుకుతున్నారు. హీరో శర్వానంద్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రాజకీయ నేత మనవరాలిని ఆయన పెండ్లి చేసుకోబోతున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇరు కుటుంబాల పెద్దలు ఈ సంబంధం కుదిర్చారు. వధువు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నది. ఈ నెల 26 శర్వానంద్ నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం. వేసవిలో ఆయన పెండ్లి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఉంటుందని తెలుస్తున్నది. మరికొద్ది రోజుల్లో వీరి వివాహానికి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. రాబోయే వేసవిలో పెళ్లి జరుగనుంది అనే వార్త ప్రస్తుతం వర్గాల వినిపిస్తోంది. నిజానికి శర్వా పెళ్లి చేసుకోబోతున్నట్లు అంటూ గతంలో కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలి అంటే స్వయంగా శర్వానంద్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సిందే అని తెలుస్తోంది.