టాలీవుడ్ భామ సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం శాకుంతలం. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.
శాకుంతలం ట్రైలర్‌ను జనవరి 9న మధ్యాహ్నం 12:06 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. పురాణ ప్రేమ గాథ, శాకుంతలం ప్రపంచంలోకి వెళ్లేందుకు రెడీగా ఉండండి అంటూ ట్రైలర్ అప్‌డేట్ అందించారు. మైథలాజికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఎంత కలర్‌ఫుల్‌గా ఉండబోతుందో తాజా లుక్‌తో తెలిసిపోతుంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో అనన్య నాగళ్ల, అదితీ మోహన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.