రజనీకాంత్ నటిస్తున్న కొత్త సినిమా జైలర్. యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ రూపొందిస్తున్నారు. తమన్నా నాయికగా నటిస్తున్నది. రమ్యకృష్ణ, కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అతిథి పాత్రలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ కనిపించనున్నారట. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. 70 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మిగతా చిత్రీకరణ కోసం మూవీ టీమ్ హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. ఇక్కడ వారం పాటు సినిమా షూటింగ్ జరుపబోతున్నారు. రజనీకాంత్‌కు సంబంధించిన ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తున్నది.