Namaste NRI

జీ2ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్తాం : అడివి శేష్‌

అడివి శేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గూఢచారి-2. వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలు. ఈ చిత్రానికి అడివి శేష్‌ కథనందించారు. చిత్ర ప్రీ విజన్‌ను లాంచ్‌ చేశారు. దర్శకుడు  మాట్లాడుతూ ఈ సినిమాలో సరికొత్త గూఢచారి ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నామని తెలిపారు. తమ సంస్థ నిర్మాణంలో ప్రస్తుతం ఇరవై సినిమాలున్నాయని, అందులో జీ2 ఎంతో ప్రత్యేకమని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ పేర్కొన్నారు. అడివి శేష్‌ మాట్లాడుతూ జీ2ని  ఓ ఫ్రాంఛైజీ మాదిరిగా ప్రపంచం మొత్తం తీసుకెళ్లాలనే తపన ఉంది. దర్శకుడు వినయ్‌కు గూఢచారి ప్రపంచంపై మంచి పట్టుంది. గూఢచారి చిత్రం దక్షిణాదిలో స్పై సినిమాల ట్రెండ్‌ను తీసుకొచ్చింది.గూఢచారి-2 కోసం సిక్స్‌ప్యాక్‌ చేయబోతున్నా. ఈ చిత్రాన్ని ఐదు దేశాల్లో షూట్‌ చేస్తాం అన్నారు.  అందరి అంచనాల్ని అందుకునే విధంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతామని అభిషేక్‌ అగర్వాల్‌ తెలిపారు. సినిమాల విషయంలో అడివి శేష్‌ ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయని వివేక్‌ కూచిభొట్ల పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, కథ: అడివి శేష్‌, దర్శకుడు: వినయ్‌ కుమార్‌ సిరిగినీడి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events