Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం

రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌  మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్‌ సిబ్బందికి లేఆఫ్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఆ విభాగాల సిబ్బంది అందరినీ సెలవులో ఉంచాలని ఆదేశించారు. ఈ ఆదేశాలతో ట్రంప్‌ కార్యవర్గం ఉత్తర్వులు జారీ చేసింది.

బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు వారందరినీ వేతనంతో కూడిన సెలవుపై పంపించాలని సంబంధిత ఏజెన్సీ లకు ఆదేశాలు అందాయి. ఈ విభాగాల‌కు చెందిన అన్ని వెబ్ పేజీల‌ను కూడా ఈ గ‌డువులోగా పూర్తిగా తొల‌గించాల‌ని ఉత్తర్వుల్లో ట్రంప్‌ కార్యవర్గం స్పష్టం చేసింది. అంతేకాకుండా డీఈఐ సంబంధిత శిక్షణ కార్యక్రమాలను కూడా తక్షణమే ముగించాలని ఏజెన్సీలకు సూచించింది. ఈ విభాగాలు చేసుకున్న ఒప్పందాల‌ను కూడా క్యాన్సిల్ చేయాల‌ ని ఆదేశించారు. దీంతో ఇప్పటికే కొన్ని వెబ్ సైట్లను అధికారులు తొలగించారు.

Social Share Spread Message

Latest News