తానా కమ్యునిటి సర్వీసెస్ కో-ఆర్డినేటర్ రాజా కసుకుర్తి సహకారంతో తానా వారు పేద ప్రజలకు శీతాకాల దుప్పట్లు, రగ్గులు పంపిణీ.కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో పేదలకు దుప్పట్లు, రగ్గులు పంపణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రామానికి ముఖ్య అతిధులుగా హనుమాన్ జంక్షన్ సిఐ మూర్తి సిఐ అల్లు నవీన్ మూరి ,వేలేరు గ్రామ ప్రముఖలు అవిర్నేని శేషగిరి,వేలేరు సర్పంచ్ సుదిమేల్ల సుందరమ్మ లు పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, తానా కమ్యునిటి సర్వీసెస్ కోఆర్డినేటర్ కసుకుర్తి రాజా సహకారంతో వారి సూచనల మేరకు వేలేరు గ్రామంలొ శీతాకాలం తీవ్ర చలి కారణంగా ఇబ్బందులు పడుతున్న 200 మంది పేదలకు దుప్పట్లు రగ్గులు పంపిణీ చేశారు.
జన్మభూమి పై మమకారంతో సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం పై రాజా కుసుకుర్తి ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు హనుమాన్ జంక్షన్ సిఐ అల్లు నవీన్ మూర్తి అన్నారు. విదేశాల్లో ఉద్యోగ, వ్యాపార రీత్యా స్ధిరపడిన తమ సొంత డబ్బులు వెచ్చించి ఉమ్మడి రాష్ట్రాల్లోని మన తెలుగువారి కోసం సేవ చేయటం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో కలపాల శ్రీధర్ , ఎంపిటిసి యోహాను, గ్రామ పెద్దలు గుత్తా నాగేశ్వరరావు ,పొట్లూరి సూర్యప్రకాషరావు , సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.