తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఎన్నారైలు మర్యాదపూర్వకంగా కలిశారు. మెల్‌బోర్న్ వేదికగా జూన్ నెలలో నిర్వహించనున్న మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయనను ఆహ్వానించారు. అలానే ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై చంద్రబాబుతో వారు చర్చించారు. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి తమవంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ భేటీలో తెలుగుదేశం విక్టోరియా ప్రెసిడెంట్ దేవేంద్ర పర్వతనేని, ఎన్నారై విభాగం కో-ఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, సభ్యులు శ్రీనాధ్ కనగాల, బలుసు కిషోర్, గుంటూరు జిల్లాకి చెందిన యడ్లపల్లి వాణి తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)