ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ నటిస్తున్న 75వ సినిమా ఖరారైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించిన వెంకీ..తాజాగా తన 75 చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విషయాన్ని నిహారిక ఎంటర్ టైన్ మెంట్ వెల్లడించింది. ప్రీలుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. చొక్కమడిచి విస్పోటనానికి ఎదురు వెళ్తున్నట్టుగా ఉన్న వెంకీ బ్యాక్ షాట్ పోస్టర్ చూస్తే ఇది యాక్షన్ సినిమాలా కనిపిస్తోంది. ఇక ఈ నెల 25 న ఈ మూవీ ప్రకటన ఉంటుందని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు, కథ ఎలాంటిది అనేది తెలియాల్సి ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు శైలేష్ కొలను స్పందిస్తూ నా విజన్ను నమ్మినందుకు వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. మీరు గర్వపడే సినిమా రూపొందిస్తానని నమ్ముతున్నాను. ఇలాంటి మంచి చిత్రబృందంతో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)