Namaste NRI

నాని కొత్త చిత్రం ప్రారంభం

నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం  హైదరాబాద్లో ప్రారంభమైంది. మృణాల్ ఠాకూర్ కథానాయిక.   ఈ సినిమా ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సీవీఎం), డా॥ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ నిర్మిస్తున్నారు. నాని నటిస్తున్న 30వ చిత్రమిది కావడం విశేషం. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నటుడు చిరంజీవి క్లాప్నివ్వగా, అశ్వనీదత్ కెమెరా స్విఛాన్ చేశారు.  పలాస కరుణ్ కుమార్, గిరీష్ అయ్యర్, దేవకట్టా, చోటా కె నాయుడు, సురేష్ బాబు, దిల్ రాజు, 14 రీల్స్ గోపి- రామ్ ఆచంట, ఎకె అనిల్ సుంకర, మైత్రి రవి, డివివి దానయ్య, స్రవంతి రవి కిషోర్, కెఎస్ రామారావు, సాహు గారపాటి, ఏషియన్ సునీల్, అభిషేక్ అగర్వాల్, నిహారిక కొణిదెల, కళ్యాణ్ దాసరి తదితరులు ఈ ప్రారంభోత్సవ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు.

విభిన్న కథాంశమిది. నాని పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. ఆయన కెరీర్లో మరో మంచి చిత్రంగా నిలిచిపోతుంది అని దర్శకుడు పేర్కొన్నాడు. బుధవారం నుంచి హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నిర్మాత తెలిపారు.  ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ఐఎస్ సి డీవోపీగా, హృదయం ఫేమ్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించనున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాద్, ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఈవీవీ సతీష్, దర్శకత్వం: శౌర్యువ్.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events