Namaste NRI

కుంభకోణం చుట్టూ..  భద్రకాళి

స్వీయ నిర్మాణంలో విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తున్న చిత్రం భద్రకాళి. అరుణ్‌ప్రభు దర్శకుడు. టీజర్‌ను విడుదల చేశారు. పిల్లి కూడా ఓ రోజు పులి అవుతుంది. అబద్ధం, అహంకారం అంతం అవుతుంది అనే డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. గ్యాంగ్‌స్టర్‌, ఫ్యామిలీ నేపథ్య సన్నివేశాలతో ఉత్కంఠను పంచింది. విజయ్‌ ఆంటోని పాత్ర సస్పెన్స్‌గా అనిపించింది. ఆయన ైస్టెలిష్‌గా కనిపించారు. 190కోట్ల కుంభకోణం చుట్టూ నడిచే కథ ఇదని, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుందని, విజయ్‌ ఆంటోని పాత్ర డిఫరెంట్‌ షేడ్స్‌తో సాగుతుందని మేకర్స్‌ తెలిపారు. వాగై చంద్రశేఖర్‌, సునీల్‌ కృపలానీ, సెల్‌ మురుగన్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంటోని, రచన-దర్శకత్వం: అరుణ్‌ప్రభు.

Social Share Spread Message

Latest News