దేశ ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడానికి బీఆర్ఎస్ ఆవిర్భవించిందని బీఆర్ఎస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మహిపల్ రెడ్డి మాట్లాడుతూ ఈనె 5 న మహారాష్ట్ర లోని నాందేడ్ లో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ కు ప్రజలు లక్షలాది గా తరలి వచ్చి కేసీఆర్కు మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఎంత వివక్షత చూపుతుందని ఆరోపించారు . ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలిస్తున్న మోదీని ప్రశ్నించడం లో కాంగ్రెస్ విఫలమయ్యిందని విమర్శించారు. దేశంలో కొత్త నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుతున్నారని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశం లో ఎక్కడా లేవని, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును తెలుసుకోవడానికి ప్రజలు తెలంగాణకు వస్తున్నారని పేర్కొన్నారు. 8ఏళ్ల బీఆర్ఎస్పాలన లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.