Namaste NRI

ఫిబ్రవరి 10న వస్తున్న దేశం కోసం

నాగలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై రవీంద్ర గోపాల హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా దేశం కోసం భగత్‌సింగ్‌. రాఘవ, మనోహర్, జీవా, సూర్య, సుధ, ప్రసాద్ బాబు ఇతర పాత్రలు పోషించారు. తాజాగా చిత్ర ప్రచార కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా  ట్రైలర్ చాలా బావుంది. సబ్‌టైటిల్స్‌  కూడా చాలా బాగా లీడ్ చేశారు అన్నారు. ఈ టైటిల్ దాసరినారాయణరావు కోసం నేను రిజిస్టర్ చేయించిన టైటిల్. కానీ మన రవీంద్రగారు నాకు ఫోన్ చేసి అడిగారు. ఈ చిత్రం బయటకు రావడం కోసం ఎంత ఇబ్బంది పడ్డారో నాకు బాగా తెలుసు. 14క్యారెక్టర్లు ఒక పర్సన్ చెయ్యడం అంటే ఆ టెన్షన్ మాములుగా ఉండదు. దేశం మీద ప్రేమ మీకు ఉంటే ఈ చిత్రం తప్పకుండా చూడండి. ఈ మూవీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. రవీంద్ర గోపాల మాట్లాడుతూ సామాజిక స్పృహతో నేనీ చిత్రాన్ని రూపొందించాను. 1947 నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో 14 మంది స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలను పోషించాను. ఈ చిత్రంతో మా అబ్బాయిని ఆజాద్ చంద్రశేఖర్‌గా  పరిచయం చేస్తున్నాను. దేశం కోసం పోరాడిన ఎంతోమంది యోధుల్లో భగత్‌సింగ్‌  ప్రధానంగా ఎంచుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రేక్షకులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుంది  అన్నారు.  ఈ నెల 10న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events