అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతిచెందాడు. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి, ఎంఎస్ చదివేందుకు సంవత్సరం క్రితం అమెరికా వెళ్లాడు. అలబామాలోని అబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ యూనివర్శిటీ సమీపంలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్ స్టేషన్‌లోని సెక్యూరిటీ గార్డ్ తన వద్ద ఉన్న తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో ఆ తుపాకీ మిస్ ఫైర్ అయ్యి అఖిల్‌సాయి తలలోకి నేరుగా బుల్లెట్ దూసుకెళ్లింది. తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అతడిని వెంటనే దవాఖానకు తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స పోందుతూ అఖిల్ మృతిచెందాడు. కాగా విద్యార్థి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో సొంత గ్రామం మధిరలో విషాద ఛాయలు నెలకొన్నాయి.