సమంత ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా శాకుంతలం. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ రూపొందించారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఇతర పాత్రలను మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, మధుబాల, గౌతమి తదితరులు పోషించారు. ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేస్తామని ముందుగా మేకర్స్ సన్నాహాలు చేసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయలేకపోతున్నట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ను వెల్లడిస్తామని చిత్రబృందం ప్రకటించింది.