రష్యాకు ఉక్రెయిన్ షాక్ ఇచ్చింది. రష్యాకు చెందిన ఆరు బెలూన్లను పేల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. కీవ్ నగరంపై ఆ బెలూన్లు ఎగురుతున్నట్లు తెలిపింది. ఆ బెలూన్లలో కార్నర్ రిఫ్లెక్టర్లు, రికనయసెన్స్ ఈక్విప్మెంట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. బెలూన్లు కీవ్ నగరంపై ఎగురుతున్న సమయంలో అలర్ట్లు జారీ చేశారు. వైమానిక క్షేత్రాలను నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో బెలూన్లను రష్యా లాంచ్ చేసి ఉంటుందని ఉక్రెయిన్ పేర్కొన్నది. రికనయసెన్స్ డ్రోన్ల నిల్వల్ని రక్షించుకునేందుకే బెలూన్లతో నిఘా పెట్టి ఉంటారని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి యూరి ఇనాట్ తెలిపారు. తమ ఎయిర్ డిఫెన్స్ దళాల్ని తప్పుదోవ పట్టించేందుకు రష్యా బెలూన్ల ఎత్తుగడ వేసినట్లు ఉక్రెయిన్ అధికారి తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)