స్వీయ దర్శకత్వంలో బిపిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం బంగారు తెలంగాణ. షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై సాయిచరణ్, సాయిత్రిశాంక్ నిర్మించారు. అశోక్‌కుమార్, రఘునాథ్ రెడ్డి, డా॥ ఏవీ స్వామి, సాయిత్రిశాంక్, కృష్ణవేణి, కవిత, దివి, డింకీ కపూర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బిపిన్ మాట్లాడుతూ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రజానేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా చిత్ర బృందం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ సాకారం అయిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి మార్పులు జరిగాయి? అభివృద్ధి పథం వైపు తెలంగాణ దూసుకుపోతున్న తీరును ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నాం. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అన్నారు. సెన్సార్ పూర్తయింది. యు సర్టిఫికెట్ లభించింది. త్వరలో ఉభయ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, సంగీతం, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: బిపిన్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)