అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. టెక్సాస్లోని సీలో విస్టా షాపింగ్ మాల్ లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. కాల్పులకు తెగబడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి రాబర్ట్ గోమెజ్ తెలిపారు. మరో నిందితుడికి కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు. అయితే మాల్లో ఎంతమంది కాల్పులకు తెగబడ్డారన్న విషయంపై స్పష్టత లేదన్నారు. ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టినట్లు రాబర్ట్ గోమెజ్ వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కాగా, రెండు రోజుల క్రితం మిచిగన్ స్టేట్ యూనివర్సిటీలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)