మాళవిక సతీషన్, అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం దోచేవారెవరురా.శివ నాగేశ్వరరావు దర్శకుడు. బొడ్డు కోటేశ్వర రావు నిర్మాత. మాస్టర్ చక్రి, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్నారు. దర్శకుడు హరీష్‌శంకర్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ ప్రతి హీరోలో ఒక డైరెక్టర్ ఉంటాడు. ప్రతి డైరెక్టర్ లో ఒక హీరో ఉంటాడు. అయితే వీరిలోని వారు, వారి లోని వీరు బయటకు రాకూడదు అని ఒక సందర్భంలో చెప్పారు. శివ నాగేశ్వరావు గారు చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి తనకున్న సెన్సాఫ్ హ్యూమర్ మాకు కూడా లేదు. తను ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాడు. మళ్ళీ ఇప్పుడు మంచి కథతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి. ఇందులో నటించిన నటులకు, టెక్నిషియన్స్ కు, నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
శివనాగేశ్వరరావు మాట్లాడుతూ డబ్బు చూట్టూ తిరిగే కథ ఇది. ప్రస్తుతం ప్రజలు ఎలా దోపిడికి గురవుతున్నారో చూపించాం. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌గా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అన్నారు. ఆద్యంతం అద్భుతమైన కామెడీతో అలరించే చిత్రమిదని నిర్మాత కోటేశ్వరరావు తెలిపారు. మార్చి 11న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: గణేష్ అర్లి, సంగీతం: రోహిత్ వర్ధన్, కార్తీక్, నిర్మాణ సంస్థ: ఐ క్యూ క్రియేషన్స్, దర్శకత్వం: శివనాగేశ్వరరావు.