టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ గణేశ్ నటిస్తోన్న చిత్రం నేను స్టూడెంట్ సర్. రాఖీ ఉప్పలపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అవంతిక దస్సానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాంది ఫేం సతీశ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్ దీప్, ఆటో రాంప్రసాద్, ప్రమోదిని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సినిమాను వాయిదా వేస్తున్నామని మేకర్స్ తెలియజేశారు. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. వేసవి సెలవుల్లో కలుద్దా అని రాబోయే రోజుల్లో కొత్త రిలీజ్ డేట్‌ను వెల్లడించనున్నట్టు తెలిపారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ వాసుదేవన్‌గా కనిపించబోతున్నాడు సముద్రఖని. సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు తెలియజేశారు.