రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఏడాది పూర్తైన సందర్భంగా ఇయర్ పేరిట ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ జెలెన్‌స్కీ మాట్లాడుతూ పుతిన్ పాలన ఎప్పుడో ఒకప్పుడు అంతం కాక తప్పదు. అతని నాయకత్వం బలహీనపడే సమయం ఆసన్నమైంది. పుతిన్‌ను ఆయన సన్నిహితులే వ్యతిరేకిస్తారు. వారు ఏదో ఒక కారణం చూపించి పుతిన్‌ను హతమారుస్తారు. ఆ రోజు నేను చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు. ఇది కచ్చితంగా జరుగుతుందా అని నన్ను అడిగితే అవును అనే సమాధానమిస్తా. కానీ, ఎప్పుడు? అంటే మాత్రం నేను చెప్పలేను అని జెలెన్‌స్కీ అన్నారు.