తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడితో ఎన్నారై తెలుగుదేశం విక్టోరియా ప్రవాస నేతలు వర్చువల్‌గా జూమ్ కాల్ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో రాష్ట్రంలో జరుగబోయే శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎన్నారై తెలుగుదేశం విక్టోరియా ప్రెసిడెంట్ దేవేంద్ర పర్వతనేని, ఉపాధ్యక్షులు ధరణేష్ యడ్లపల్లి, కోశాధికారి ప్రశాంత్ వీరమాచినేని, పార్టీ సభ్యులు శ్రీనివాస్ చౌదరి, బసంత్ మండవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఉపాధ్యాయ సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, వివిధ అంశాలపై సూచనలు ఇచ్చారు. ఎన్నారైల తరుపున తమవంతు కృషి చేస్తాం అని చంద్రబాబుకి వారు తెలియజేశారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.