Namaste NRI

ఆ దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ రివార్డు

ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతీయ వ్యక్తిపై ఏకంగా రూ. 5.2కోట్ల రివార్డు ప్రకటించింది. అతడిని పట్టించిన వారికి ఈ భారీ మొత్తాన్ని ఇస్తామని తెలిపింది. పంజాబ్లోని బటర్ కలాన్కు చెందిన రాజ్వీందర్ సింగ్ ఆస్ట్రేలియాలోని ఇన్నిస్ ఫైల్లో భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. అక్కడే నర్సుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2018లో క్వీన్స్లాండ్లోని వంగెట్టి బీచ్లో తోయా కార్డింగ్లీ అనే యువతిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన బీచ్ మర్డర్ పేరిట ఆస్ట్రేలియాలో సంచలనంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో హత్య చేసింది రాజ్వీందరేనని తేల్చారు. కానీ, అప్పటికే అతడు తన భార్య, ముగ్గురు పిల్లలను అక్కడే వదిలేసి భారత్కు పారిపోయి వచ్చేశాడు. అప్పటి నుంచి రాజ్వీందర్పై నిఘా పెట్టిన ఆస్ట్రేలియన్ పోలీసులు.. అతడు ఇండియాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో 2021 మార్చిలో రాజ్వీందర్ను తమకు అప్పగించాలని కోరుతూ ఆస్ట్రేలియా సర్కార్ లేఖ రాసింది. దీనికి 2022 నవంబర్లో భారత ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆ తర్వాత మన పోలీసులు రాజ్వీందర్ కోసం వేట ప్రారంభించారు.
పంజాబీ, హిందీ తెలిసిన ఐదుగురు పోలీసు అధికారులను కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం నియమించింది. వీరు ఎప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ, సీబీఐ అధికారులు, స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం రాజ్వీందర్ను పట్టించిన వారికి రూ. 5.2 కోట్ల రివార్డ్ కూడా ప్రకటించింది. ఆ దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ రివార్డు కూడా. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్ 25న ఢిల్లీ పోలీసులు రాజ్వీందర్ను చాకచక్యంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మహిళ హత్య కేసుకు సంబంధించి ఇంటర్పోల్ అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దీని తర్వాత పాటియాలా హౌస్ కోర్ట్ నవంబర్ 21న అప్పగింత చట్టం కింద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విక్టోరియాలోని మెల్బోర్న్ మేజిస్ట్రేట్ కోర్టులో అప్పగింతపై విచారణ జరిగింది. రాజ్వీందర్కు హత్యతో సంబంధం ఉన్నట్లు డీఎన్ఏ ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress