Namaste NRI

కస్టడీ డబ్బింగ్ షురూ

నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకుడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో భాగంగా డబ్బింగ్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న ఫొటోని పంచుకున్నారు. నాగచైతన్య కెరీర్‌లోనే  అత్యధిక బడ్జెట్‌తో  తెరకెక్కిస్తున్న చిత్రమిదని, త్వరలో టీజర్‌ను  విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో నాగచైతన్య పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అరవింద్‌స్వామి  ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ప్రియమణి, శరత్‌కుమార్‌ ప్రేమ్‌జీ,  అమరెన్, సంపత్‌రాజ్‌,   వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు.  మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా  విడుదల కానుంది.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్ఆర్ కతీర్, సంగీతం: ఇళయరాజా, యువన్‌శంకర్‌రాజా, సంభాషణలు: అబ్బూరి రవి, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్‌, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events