ఈ ఏడాది హెచ్ 1బీ వీసాల ర్యాండమ్ ఎంపికలో అవకాశం దక్కని వారికి అమెరికా మరో అవకాశం కల్పించనుంది. దరఖాస్తుదారుల కోసం రెండో లాటరీ తీయనున్నట్లు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన కంప్యూటరైజ్డ్ డ్రాలో సరిపడినన్ని వీసాలు జారీ చేయని కారణంగా మరోసారి లాటరీ తీయాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఫలితంగా హెచ్ 1 బీ వీసాల కోసం ఎదురుచూస్తున్న వందలాది భారతీయ ఐటీ ఉద్యోగులకు మరో అవకాశం దక్కనుంది.
ఇప్పటికే సమర్పించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లను ఈ నెల 28న ర్యాండమ్ పద్ధతిలో ఎంపిక చేసినట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ వెల్లడిరచింది. ఈ నెల 28న ఎంపిక చేసిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పిటిషన్ ఫైలింగ్ గడువు ఆగస్టు 2వ తేదీన ప్రారంభమై, నవంబర్ 3న ముగియనుంది. హెచ్ 1బీ పిటిషన్ల కోసం ఆన్లైన్ ఫైలింగ్ అందుబాటులో లేదు. దరఖాస్తుదారులు కాగితం ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.