సమంత, దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం. ఈ సినిమా గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ విడుదలకు మాత్రం అడుగుడుగున అడ్డంకులే ఎదురయ్యాయి. ఇప్పుడోస్తుంది.. అప్పుడోస్తుంది అంటూ పలుసార్లు డేట్లను కూడా వాయిదా వేశారు. ఏప్రిల్ 14న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్ర పోషించాడు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. రుద్రమ దేవి తర్వాత దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని గుణశేఖర్ ఈ సినిమాను రూపొందించాడు. చిత్రంలో డా.ఎం.మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా కీలక పాత్రలను పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించటం వన్ ఆఫ్ ది హైలైట్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మాలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)