దాదాపు మూడేళ్ల తర్వాత చైనా విదేశీ టూరిస్టులకు వీసా లు జారీ చేయనున్నది. కరోనా మహమ్మారి వల్ల గత మూడేళ్ల నుంచి ఆ దేశం విదేశీ టూరిస్టుల ను నిషేధించింది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న జీరో కోవిడ్ విధానాన్ని కూడా అక్కడ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యాటకులకు వీసాలు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈనెల 15వ తేదీ నుంచి కొత్త వీసాల ను జారీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. హైనన్ దీవితో పాటు షాంగై కు క్రూయిజ్ షిపుల్లో వచ్చేవారికి మాత్రం వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించనున్నారు. హాంగ్‌కాంగ్, మకావ్‌లోని టూరు గ్రూపులకు వీసా లేకుండా ఎంట్రీ ఇవ్వనున్నారు. 2020 మార్చి 28కు ముందు విదేశీయులకు జారీ చేసిన వీసాలు చెల్లుబాటు అవుతాయని చెప్పింది. వివిధ దేశాల్లో ఉన్న చైనా కౌన్సులేట్లు త్వరలోనే వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయనున్నట్లు చెప్పారు. 2020 మార్చి 28వ తేదీ నుంచి విదేశీ టూరిస్టులకు వీసాలు ఇవ్వడాన్ని చైనా నిలిపివేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)