ఆస్ట్రేలియా నేషనల్ గ్యాలరీలో ఉన్న 15 భారతీయ కళాఖండాలను తిరిగి స్వదేశానికి రప్పిస్తున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశంతో సాంస్కృతిక, విదేశాంగ మంత్రిత్వ శాఖలు నిరంతరం దృష్టి సారించడంతో సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ కళాఖండాలను భారత్‌కు రప్పించడం సాధ్యమవుతోందని పేర్కొన్నారు. ఇందులో శ్రీనాథ్‌జీ పెయింటింగ్‌లు, రాగమాల సిరీస్‌లో ఒక పేజీ, యకబైరవ, కాళీ యంత్ర, చీరకట్టుకున్న యువత, దుర్శమ్‌రామ్‌జీ ముందు లక్ష్మణ్ ఛండీజీ, కృష్ణ, అర్జున, భూమిని రక్షిస్తున్న వరాహం, శృంగార దంపతులు, శివపార్వతులు, మర్రిఆకుపై ఉన్న చిన్నికృష్ణుడు, తమిళనాడు నుంచి చోరీ చేసిన 3 కాంస్య విగ్రహాలు వంటివి ఉన్నట్లు చెప్పారు.