Namaste NRI

ఆప్త ఆధ్వర్యంలో ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు ఘన సన్మానం

ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమాలోని నాటు నాటు  పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ప్రపంచ సినీ అత్యున్నత పురస్కారం ఆస్కార్ అందుకున్నది. ఈ శుభ సందర్భంగా  గేయ రచయిత చంద్రబోస్‌, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ ( ఆప్త ) అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబోస్‌ను ఆప్త అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్‌ కొట్టె సత్కరించారు.

అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబోస్‌ తాజాగా అట్లాంటా వెళ్లారు. ఈ సందర్భంగా ఆప్త సభ్యులు చంద్రబోస్‌కు సాదర స్వాగతం పలికారు. ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఉదయభాస్కర్‌ మాట్లాడుతూ  యావత్‌ తెలుగు ప్రజలే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడి కలను నెరవేర్చారని ఈ సందర్భంగా కొనియాడారు. తెలుగుదనం ఉట్టిపడేలా, తెలుగు నేటివిటీతో భవిష్యత్తులో చంద్రబోస్‌ కలం నుంచి మరెన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు రావాలని ఆకాంక్షించారు.

సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు అట్లాంటాలో జరిగే 15వసంతాల ఆప్త కన్వెన్షన్‌కు హాజరుకావాలని చంద్రబోస్‌ ను ఉదయ్‌భాస్కర్‌ సాదరంగా ఆహ్వానించారు. దీనికి చంద్రబోస్‌ కూడా అంగీకారం తెలిపారు. అడిగినదే తడవుగా చంద్రబోస్ అంగీకరించి ఆప్త పట్ల తమకున్న ప్రత్యేక ప్రేమను చాటుకున్నందుకు ఆప్త తరపున సభ్యులందరూ కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events