ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టు ఆగస్టు 25న తీర్పు వెలువరించనుంది. జగన్ బెయిల్ రద్దు నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నట్లు సీబీఐ పేర్కొంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. రఘురామ వేసిన పిటిషన్‌పై జగన్‌తో పాటు రఘురామరాజు కూడా లిఖిత పూర్వక వాదనలను గతంలోనే కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు సీబీఐ తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ మెమో దాఖలు చేసింది. కోర్టు విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలని సీబీఐ మెమోలో పేర్కొంది. ఈ మూడిరటిని పరిగణనలోకి తీసుకున్న అనంతరం కోర్టు కేసు విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. ఈ రోజు కోర్టు తన నిర్ణయం వెల్లడిరచనున్నట్లు తెలుస్తోంది.