అమెరికాలో మొదటి తరం ఐ ఫోన్ వేలంలో రూ.45 లక్షలకు అమ్ముడుపోయి మరోసారి సంచలనం సృష్టించింది. గత నెలలో మొదటి తరం ఐఫోన్ రికార్డు స్థాయిలో 63,356 డాలర్లు (సుమారు 52 లక్షలు)కు అమ్ముడుపోగా, గత ఏడాది ఆగస్టులో ఇలాంటి ఫోన్‌ను రూ.28 లక్షలకు అమ్మారు.ఇప్పుడు రూ.45 లక్షల ధర పలకడంతో పాతతరం ఫోన్లపై అమెరికన్లకున్న మోజెంతో వెల్లడవుతున్నది. 2007లో విడుదలైన మొదటి తరం ఫోన్ వాస్తవ ధర 599 డాలర్లు. ఆపిల్‌కు చెందిన మాజీ ఉద్యోగి ఒకరు అప్పట్లో తాను కొన్న సీల్డ్ ప్యాక్‌లో ఉన్న మొదటి తరం ఐ ఫోన్‌ను వేలంలో పెట్టాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/f45ad641-4a72-48bc-b72d-4f37995c2771-39.jpg)