అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ 92 ఏండ్ల వయసులో ఐదో పెండ్లికి సిద్ధమవుతున్నారు. తన ప్రియురాలు అయిన 65 ఏండ్ల యాన్ లెస్లీ స్మిత్ ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. మార్చి 17న న్యూయార్క్‌లోని ఓ హోటల్లో వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మళ్లీ ప్రేమలో పడ్డాను. ఇదే నా చివరి వివాహం అవుతుందని నాకు తెలుసు అని రూపర్ట్ మర్దోక్ వెల్లడించారు. మరోవైపు లెస్లీ స్మిత్ భర్త కూడా ఓ వ్యాపారవేత్తనే. 14 ఏండ్ల క్రితమే ఆయన చనిపోయారు. అప్పటి నుంచి ఒంటిరగా ఉన్న లెస్లీ మర్దోక్ చేసిన పెండ్లి ప్రతిపాదనకు అంగీకారించింది. ఆయనతో జీవితం పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. మర్దోక్, స్మిత్‌ల వివాహం ఈ వేసవిలో జరగనుండగా.. అమెరికా, బ్రిటన్‌లో గడపాలని కొత్త జంట భావిస్తోంది. నాలుగో భార్య అయిన జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకుని ఏడు నెలలు కూడా పూర్తికాకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/f45ad641-4a72-48bc-b72d-4f37995c2771-42.jpg)