యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. 1,025 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 1,025 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ముఖ్యమైన ఇస్లామిక్ సందర్భాలలో యూఏఈలోని ప్రతి ఎమిరేట్ పాలకులు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తుంటారు. సత్ర్పవర్తన కలిగిన ఖైదీలకు సామాజిక, వృత్తిపరమైన జీవితాలను గడపడానికి వీలుగా వారికి ఒక అవకాశం కల్సించాలనే ఉద్దేశంతో ఇలా క్షమాభిక్ష పెడుతుంటారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/f45ad641-4a72-48bc-b72d-4f37995c2771-50.jpg)