సౌదీ అరేబియా దేశంలోని నివాసితులు, యజమానులకు తాజాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. చెల్లుబాటయ్యే వీసా లేని వారికి ఎట్టిపరిస్థితుల్లో ఎలాంటి సాయం చేయొద్దని హెచ్చరించింది. ఈ మేరకు పబ్లిక్ సెక్యూరిటీ అథారిటీ కీలక ప్రకటన చేసింది. వీసాల నిబంధనలను ఉల్లంఘించేవారికి ఉపాధి కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం, సహాయం చేయడం వంటివి చేయకూడదని నివాసితులను కోరింది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే అలాంటి వారికి 1లక్ష సౌదీ రియాళ్ల (సుమారు రూ. 22లక్షలు) జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని తెలియజేసింది. అలాగే శిక్షకాలం పూర్తైన తర్వాత దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుందని తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/f45ad641-4a72-48bc-b72d-4f37995c2771-51.jpg)