రవితేజ ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతడెవరనే కదా మీ డౌటు. రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ . పెళ్లి సందD తో డైరెక్టర్‌గా మంచి బ్రేక్ అందుకున్న గౌరీ రోనంకి దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు మాధవ్. ప్రొడక్షన్ నంబర్ 2గా తెరకెక్కుతున్న ఈ మూవీ గ్రాండ్‌గా లాంఛ్ అయింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. ఈ చిత్రాన్ని యెలమంచి రాణి సమర్పణలో జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పీ నిర్మిస్తోంది. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. దర్శకురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ మా హీరో మాధవ్ ను నమ్మినందుకు నిర్మాత రవిచంద్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. వారు చెప్పినట్టుగా ఇది చాలా యూత్ ఫుల్ గా సాగే కలర్ ఫుల్ గా ఉండే సినిమా. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు ఈ కథ విని చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్ తో సపోర్ట్ గా నిలుస్తున్నారు అనుకుంటున్నాను. ఇక నా గత చిత్రం లాగానే మీడియా సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో మాధవ్ మాట్లాడుతూఅందరికీ చాలా థ్యాంక్యూ. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ చిత్రం విడుదలయ్యేంత వరకూ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఇక్కడి వచ్చిన అందరికీ థ్యాంక్యూ సో మచ్ అన్నారు. ఈ మూవీలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో ఎవరు కనిపించబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టారు మేకర్స్. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. రఘు పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఈ కార్యక్రమానికి రవితేజ హాజరు కాలేదు. రవితేజ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల లాంఛింగ్ ఈవెంట్‌కు రాలేకపోయారని నిర్మాత రవిచంద్ తెలిపారు. అయితే చిత్రయూనిట్‌కు రవితేజ శుభాకాంక్షలు తెలియజేశారన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/WB-3.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/d5b7f241-3200-42f7-aeb9-47b1f0e899f3-3.jpg)