విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. కశ్మీర్ నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హృదయానికి హత్తుకునే ప్రణయకావ్యమిదని, విజయ్ దేవరకొండ, సమంత మధ్య కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీశర్మ, లక్ష్మీ, ఆలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి కెమెరా: జి.మురళి, సంగీతం: హిషామ్ అబ్దుల్ వాహబ్, రచనా సహకారం: నరేష్ బాబు.పి, సీఈఓ: చెర్రీ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ. సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు.