మహేశ్ బాబు కొత్త సినిమా నుంచి రిలీజ్ అప్‌డేట్ వచ్చింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న మోస్ట్ వాంటెడ్ ఫిల్మ్ ఎస్ఎస్ఎంబి 28(వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టులోనే ఈ సినిమాను విడుదల చేయాలని ముందుగా అనుకున్న, చిత్రీకరణ ఆలస్యమవుతూ రావడం వల్ల ఆ తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సాధ్యమయ్యేలా కనిపించలేదు. దీంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ ని సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్ ను వదిలారు. నిసూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 28తో సరికొత్త మాస్ అవతార్లో జనవరి 13, 2024 నుండి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అలరించనున్నారు అంటూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ అసలుసిసలైన సంక్రాంతి సినిమాని తలపిస్తూ విశేషంగా ఆకట్టుకుంటోంది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ఎడిటర్ గా జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి , కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్ వ్యవహరిస్తున్నారు.