అమెరికాలోని సియాటెల్ నగరంలో కులవివక్ష నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో భారతదేశం ఆవల ఇలాంటి చట్టాన్ని అమలు చేస్తున్న నగరంగా సియాటిల్ నిలిచింది. కుల వివక్షను వ్యతిరేకిస్తూ గత నెలలో రాజకీయనేత, ఇండియన్-అమెరికన్ క్షామ సావంత్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సియాటిల్ సిటీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్ట ప్రకారం వ్యాపార పరంగా గానీ, నివాస పరంగా గానీ, రవాణా పరంగా గానీ, పనిచేసే చోటగానీ కులం ఆధారంగా వివక్ష చూపకూడదు. ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి.