తమ క్లయింట్ దేశాల్లో కొన్ని పెగాసస్ స్పైవేర్‌ను వినియోగించకుండా ఎన్ఎస్వో సంస్థ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ సైబర్ భద్రత సంస్థ పెగాసస్ దుర్వినియోగం ఆరోపణలపై అంతర్గత దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే కొన్ని దేశాల ప్రభుత్వ సంస్థలకు స్పైవేర్‌ను బ్లాక్ చేసింది. పెగాసస్ ప్రాజెక్టు పేరుతో కొన్ని మీడియా సంస్థలు స్పైవేర్ దుర్వినియోగంపై కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్‌ఎస్‌వోపై విమర్శలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. నాలుగు రోజుల క్రితం ఎన్ఎస్వో కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.