ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి కుమార్ పరాస్‌లను కోరినట్లు రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. ఢల్లీిలోని ఏపీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని బాపట్ల సూర్యలంక బీచ్‌ను పర్యాటకులకు అనుగుణంగా మార్చే పనులకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేసినట్లు తెలిపారు. బాపట్ల భావనారాయణస్వామి ఆలయం, రాష్ట్రంలో సముద్రతీర పర్యాటక అభివృద్ధి అంశాలపై కూడా కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు. రైతు భరోసా ఇతర సంక్షేమ పథకాలను కేంద్ర మంత్రి పరాస్‌కు వివరించినట్లు వెల్లడిరచారు. పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నానని తెలిపారు.