బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒలంపిక్స్ వేదికగా చరిత్ర సృష్టించింది. మహిళల బ్యాండ్మింటన్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు కాంస్య పతకం సాధించింది. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో సాగిన పోరులో సింధు స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. 21-13,21-15 తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. దీంతో టోక్యో ఒలంపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం సాధించి పెట్టిన ఘనత సింధు వశమైంది. 2016 రియో ఒలంపిక్స్‌లోనూ సింధు సిల్వర్ మెడల్ గెలిచిన విషయం విదితమే. శనివారం జరిగిన సెమీస్‌లో పరాజయం పాలవడంతో గోల్డ్ మెడల్ గెలవాలన్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఆ షాక్ నుంచి సింధు వెంటనే కోలుకుంది. చివరకు కాంస్య పతకం సాధించింది.