హుజూరాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కనున్నది. గవర్నర్ కోటాలో ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును ఖరారు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు చేసింది. ఆమోదం కోసం సంబంధిత ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపాక కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నది. ఆయన హుజూరాబాద్ నియోజకవర్గానికో, కరీంనగర్ జిల్లాలో పరిమితం కాడు. నేను ఆయన భవిష్యత్తుకు మార్గం ఏర్పాటు చేస్తా అని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తూ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. కౌశిక్‌రెడ్డికి నామినేటెడ్ ఎమ్మెల్సీ ప్రకటించడంపై హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు సంబురంలో మునిగిపోయారు.