సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో రేపటి (ఆగస్టు 3) నుంచి అన్ని రకాల వైద్య సేవలను పునరుద్ధరించనున్నారు. రాష్ట్రంలో కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో దవాఖానలో నాన్ కొవిడ్ సేవలను తిరిగి ప్రారంభించాలని వారం క్రితం వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా విజృంభణతో ఏప్రిల్ 15న గాంధీ దవాఖానలో కొవిడ్ సేవలు తప్ప నాన్ కొవిడ్ సేవలు (ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు, సర్జరీలు) నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నెలలుగా సాధారణ వైద్య సేవలు అందక రోగులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం కరోనా ఉధృతి లేకపోవడంతో రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల సేవలు ప్రారంభిస్తూ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది.