ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. తిరుపతిలో చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయంగా మార్పు రాబోతోందని అన్నారు. మరికొన్ని వారాల్లో ముఖ్యమంత్రి జగన్ మాజీ కాబోతున్నారని అన్నారు. జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తీరు వివాదాస్పదంగా ఉందన్నారు. బెయిల్ కేసు నుంచి బయటపడేందుకు ఉత్తరాది పారిశ్రామిక వేత్త, కేంద్ర మంత్రి కుమారుడి సాయాన్ని జగన్ కోరుతున్నారని చెప్పారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్‌ను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ రఘురామకృష్ణరాజును కొట్టడం తప్పన్నారు.