గోపీచంద్ హీరోగా డింపుల్ హయతి హీరోయిన్ గా లేటెస్ట్ గా తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ రామబాణం. శ్రీవాస్ దర్శకత్వం. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ఐఫోన్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మిక్కీ జె మేయర్ మెలోడియస్ ట్యూన్ అందించిన ఈ సాంగ్ ని కాసర్ల శ్యామ్ రచించగా రామ్ మిరియాల, మోహన భోగరాజు అద్భుతంగా పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ యువత తో పాటు శ్రోతలు అందరినీ ఆకట్టుకుంటోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-8.jpg)
ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ అందరినీ ఆకట్టుకుని అందరిలో ఆ అంచనాలు మరింతగా పెంచాయి. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు, ఖుష్బు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కాగా, రామబాణం మూవీని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్ కానుకగా మే 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/4b3127df-f30c-4f25-9c19-7ecfdbd57b90-51-8.jpg)