క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ విడుదల చేసిన డాక్యుమెంటరీలో సెక్స్ సద్గుణాలను ప్రశంసించారు. సెక్స్ అనేది దేవుడు మానవులకు ఇచ్చిన అందమైన వాటిలో ఒకటి గా ఆయన అభివర్ణించారు. గతేడాది రోమ్ లో 20 ఏండ్ల వయసులో ఉన్న పది మంది యువకులతో ముచ్చింటించిన పోప్ ఫ్రాన్సిస్.. యువకులు అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలను ది పోప్ ఆన్సర్స్ పేరుతో డిస్నీ ప్రొడక్షన్ డ్యాక్యుమెంటరీని విడుదల చేసింది. పోప్ ఫ్రాన్సిస్‌తో మాట్లాడిన పది మంది యువకులు కేథలిక్ చర్చి పరిధిలోని ఎల్జీబీటీ హక్కులు, అబార్షన్, అశ్లీల పరిశ్రమ, శృంగారం, దైవ విశ్వాసం వంటి అనేక అంశాలపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోప్ దేవుడు మనిషికి ఇచ్చిన అందమైన వాటిలోలో శృంగారం ఒకటి అని ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.
ఎల్జీబీటీ హక్కుల గురించి పోప్ మాట్లాడుతూ ఎల్జీబీటీ వ్యక్తులను కేథలిక్ చర్చి తప్పనిసరిగా స్వాగతించాలన్నారు. అందరూ దేవుడి బిడ్డలే.. ఆయనే తండ్రి. భగవంతుడు ఎవరినీ తిరస్కరించడు. అందువల్ల చర్చి నుంచి ఏ ఒక్కరినీ బయటకు పంపే హక్కు నాకు లేదు అని అన్నారు. అబార్షన్లపై మాట్లాడుతూ గర్భస్రావం చేయించుకున్న మహిళలపై మత ప్రబోధకులు కనికరం కలిగి ఉండాలి. కానీ ఈ ఆచరణ ఆమోదయోగ్యం కాదు అని అన్నారు.