తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపాడ్) తాజాగా డల్లాస్‌లో తన 11వ బ్లడ్ డ్రైవ్ నిర్వహించింది. ప్రతిసారి బ్లడ్ డ్రైవ్‌తో కొత్త ఏడాదిని ప్రారంభించడం టీపాడ్ సంప్రదాయంగా వస్తున్నది. గత పదేండ్లుగా టీపాడ్ డల్లాస్‌లో బ్లడ్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నది. అయితే కరోనాకు ముందు ఏటా ఒక్కసారి మాత్రమే బ్లడ్ డ్రైవ్ నిర్వహించే టీపాడ్, ఇప్పుడు ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తున్నది. డల్లాస్‌లోని కార్టర్ బ్లడ్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ సంస్థల సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించింది. ఐటీ స్పిన్ సంస్థ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో 48 మంది పాల్గొని, తమ సామాజిక బాధ్యతను నిర్వహించారు. దాతల నుంచి మొత్తం 50 పింట్స్ రక్తాన్ని సేకరించామని, దీన్ని గుండె సంబంధిత శస్త్రచికిత్సలు జరిగిన సందర్భాల్లో ఉపయోగిస్తామని కార్టర్ సంస్థ సిబ్బంది పేర్కొన్నారు.
సామాజిక సేవలో ముందుండే టీపాడ్ గత పదేళ్లుగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది. ఇక కరోనా సంక్షోభం తరువాత ఏటా రెండు సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రారంభించింది. రక్తదాన శిబిరాల నిర్వహణతో టీపాడ్ ఇప్పటివరకూ వెయ్యికి పైగా ప్రజల ప్రాణాలు కాపాడింది. ఈ సేవలకు గుర్తుగా కార్టర్ బ్లడ్ కేర్ సంస్థ టీపాడ్‌ను సామాజిక సేవలో కమ్యూనిటీ ఛాంపియన్‌గా గుర్తించింది. ఇక.. డాలస్‌లో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న వలంటీర్లు, దాతలు, సహాయకులందరికీ టీపాడ్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపింది.
ఒక పింట్ రక్తం ద్వారా ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చు. ఇప్పుడు టీపాడ్ ఇచ్చిన రక్తం 150 మంది ప్రాణాలను కాపాడేందుకు తోడ్పడుతుంది. తొమ్మది గుండె ఆపరేషన్‌లకు, 16 రక్తమార్పిడిలకు ఈ రక్తం సరిపోతుంది. ఈ బ్లడ్ డ్రైవ్‌ను కన్నయ్యగారి రూపా, లింగంపల్లి నరేష్ సమన్వయం చేశారు. బండారు రఘువీర్ రెడ్డి (ఎఫ్‌సీ చైర్), అల్వా లింగారెడ్డి (అధ్యక్షుడు), కలసాని సుధాకర్ (బోఓటీ చైర్), ఆదెపు రోజా (కో ఆర్డినేటర్) ఈ బ్లడ్ డ్రైవ్‌కు మార్గదర్శనం చేశారు. అదేవిధంగా టీపాడ్ టీమ్ అంతా ఈ డ్రైవ్‌కు సహకారం అందించింది.