ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సినిమా జర్నలిస్ట్‌లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వినతి పత్రం సమర్పించింది. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నిర్వహించాలనుకుంటున్న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు మంత్రిని హాజరు కావాలని కోరింది. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోయేషన్ అధ్యక్షుడు ఎ.ప్రభు మంత్రి తలసానిని సత్కరించారు.