హష్ మనీ కేసులో మన్‌హట్టన్ కోర్టులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విచారించిన విషయం తెలిసిందే. ఆ కేసులో తొలుత సరెండర్ అయి, ఆ తర్వాత ఆయన విడుదలైన విషయం కూడా తెలిసిందే. ట్రంప్ పై మొత్తం 34 నేరాభియోగాలు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ మీడియాతో మాట్లాడారు. ట్రంప్‌పై ఉన్న నేరాభియోగాల విషయంలో ఆయనకు జైలు శిక్ష పడాల్సిన అవసరం లేదని తెలిపారు. తనకు జరిగిన పేమెంట్ అంశంలో ట్రంప్ జైలు శిక్షకు అర్హుడు కాదని ఆమె అన్నారు. తన పట్ల ట్రంప్ పాల్పడిన నేరం జైలుశిక్షకు తగినది కాదని ఆమె తెలిపారు. పోర్న్ స్టార్‌కు డబ్బులు ఇచ్చే విషయంలో వ్యాపార రికార్డులను తారుమారు చేసినట్లు ట్రంప్‌పై కేసు నమోదు అయ్యింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-18.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/4b3127df-f30c-4f25-9c19-7ecfdbd57b90-51-20.jpg)