ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనేది అందరికి తెలిసిన విషయమే అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేస్తుందని బీజేపీ నేతలు చేసిన విమర్శలపై ఆయన మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రూ.3 లక్షల కోట్లకు తోడు కరోనా సంక్షోభం తోడు కావడంతో అప్పులు మరింత పెరిగాయన్నారు. తాను కొన్ని నిధులను సంక్షేమ పథకాలను వెచ్చించడం వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్పులు చేయడం లేదా అని ప్రశ్నించారు. మరి బీజేపీ చేస్తే ఒప్పు.. తాము చేస్తే తప్పా అని కేంద్రాన్ని నిలదీశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది ఒక్క ఏపీ రాష్ట్రమే కాదు, కేంద్రం సహా అన్ని రాష్ట్రాలూ సంక్షోభంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమర్ రాజా బ్యాటరీ సంస్థను తమ ప్రభుత్వమే పొమ్మంటోందని తెలిపారు. అమర్ రాజా కంపెనీ వల్ల విష పదార్థాలు వస్తున్నట్లు హైకోర్టు ధృవీకరించిందని తెలిపారు.